Mon Dec 23 2024 02:12:24 GMT+0000 (Coordinated Universal Time)
Supreme Court : మరోసారి ఎస్బీఐకి తలంటిన సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరోసారి భారతీయ స్టేట్ బ్యాంక్ పై సుప్రీంకోర్టు ఇంకోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో మరోసారి భారతీయ స్టేట్ బ్యాంక్ పై సుప్రీంకోర్టు ఇంకోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ను బాండ్ల వివరాలను సమర్పించాలని ఇటీవల ఆదేశించింది. డెడ్ లైన్ కూడా విధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపే ఎస్బీఐ తన బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందించింది. అయితే పూర్తి వివరాలు ఇవ్వలేదు. బాండ్లకు సంబంధించి ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు తమకు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఎందుకు ఇవ్వలేదంటూ...
దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల నెంబర్లు లేకపోతే ఎవరు ఎంత ఇచ్చారన్నది ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. అన్ని వివరాలను వెల్లడించాలని తాము స్పష్టమైన తీర్పు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. దీనికి సమాధానం ఇవ్వాలంటూ ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అన్ని వివరాలతో ఎన్నికల కమిషన్ కు సోమవారం నాటికి అందచేయాలని పేర్కొంది.
Next Story