Mon Dec 23 2024 15:12:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విజయ్ మాల్యాకు శిక్ష ఖరారు
కోర్టు థిక్కారం కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు నాలుగు నెలల శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
కోర్టు థిక్కారం కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు నాలుగు నెలల శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రెండు వేల జరిమానాను విధించింది. కోర్టు ఆదేశాలను థిక్కరించి 48 మిలియన్ డాలర్లను విజయ్ మాల్యా పిల్లల పేర్లపై బదిలీ చేసినందుకు ఈ శిక్ష సుప్రీంకోర్టు విధించింది.
కోర్టు థిక్కారానికి....
విజయ్ మాల్యా కోర్టు థిక్కారణకు పాల్పడటంపై గతంలోనే విచారణ జరిగింది. అయితే తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. ఈరోజు తీర్పు చెప్పింది. అయితే విజయ్ మాల్యా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయనను దేశానికి తీసుకు వచ్చిన తర్వాతనే ఈ శిక్ష అమలవుతుంది.
Next Story