Sat Nov 23 2024 00:39:08 GMT+0000 (Coordinated Universal Time)
పేస్ట్ లా ఉన్న వస్తువు.. 25 కోట్లు వస్తాయట
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎప్పటిలాగే చెకింగ్ చేస్తున్నారు అధికారులు. అదే సమయంలో షార్జా నుండి సూరత్ కు వచ్చిన కొందరు
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎప్పటిలాగే చెకింగ్ చేస్తున్నారు అధికారులు. అదే సమయంలో షార్జా నుండి సూరత్ కు వచ్చిన కొందరు ప్రయాణీకుల మీద అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్ల దగ్గర ఉన్న వస్తువులను, వాళ్లను తనిఖీ చేయగా.. ఓ పేస్ట్ లాంటి పదార్ధం కనిపించింది. ఆ పేస్ట్ మరేదో కాదని అధికారులకు అర్థం అయింది. ఒకటీ కాదు.. రెండూ కాదు.. ఏకంగా 48.20 కిలోల బంగారం. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత బంగారం విదేశాలలో ఎటువంటి హెల్ప్ లేకుండా భారత్ కు చేరే అవకాశమే లేదని అర్థమైపోయింది.
సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 48.20 కిలోల బంగారు పేస్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి సూరత్ కు వస్తున్న ప్రయాణీకులను అధికారులు తనిఖీ చేయగా.. 48.20 కిలోల బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఖరీదు దాదాపు రూ.25 కోట్లు. ఈ కేసులో ముగ్గురు ప్రయాణికులు, ఒక అధికారిని అరెస్టు చేశారు. డిపార్ట్మెంట్ అధికారులు జూలై 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ నంబర్ IX 172లో షార్జా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. వీరు బంగారాన్ని పేస్టుగా మర్చి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించారు. వారి బ్యాగేజీని తనిఖీ చేయగా 20 తెలుపు రంగు ప్యాకెట్లలో 43.5 కిలోల బంగారు పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని అధికారులు కూడా సహకరించారని భావిస్తున్నారు. నిందితులందరి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి తీగ దొరికిందని పోలీసులు చెబుతున్నారు. డొంక లాగితే ఎవరెవరి ప్రమేయం బయటకు వస్తుందో?
Next Story