Thu Dec 19 2024 14:56:34 GMT+0000 (Coordinated Universal Time)
Marriage : ఒకే ఇంట్లో పదిహేడు మందికి ఒకే సారి పెళ్లి.. అరుదైన ఘటన ఎక్కడంటే?
రాజస్థాన్ కు చెందిన సూర్జారామ్ గోదారా తన ఇంట్లో పదిహేడు మంది మనవలు, మనవరాళ్లకు ఒకేసారి పెళ్లి జరిపించారు
పెళ్లి అంటే మామూలు విషయం కాదు.. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయాలంటే గగనంగా మారుతుంది. పెళ్లి పత్రికల నుంచి ముహూర్తానికి వివాహ వేడుక జరిపించడం వరకూ ఒక పెద్ద కార్యమే చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సాయం లేకుంటే మాత్రం పెళ్లిళ్లు చేయలేరు. అలాంటిది ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది పెళ్లిళ్లు జరపడం అంటే మామూలు విషయం కాదన్నది అందరికీ తెలిసిందే.
కానీ ఒకేసారి పదిహేడు పెళ్లిళ్లు జరిపించారు ఆ ఇంటి పెద్దలు. అది మనదేశంలోని రాజస్థాన్ లో. రాజస్థాన్ కు చెందిన సూర్జారామ్ గోదారా తన ఇంట్లో పదిహేడు మంది మనవలు, మనవరాళ్లకు ఒకేసారి పెళ్లి చేయాలని భావించారు. ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి వేడుకను నిర్వహించాలనుకున్నారు. ఆయన తన మనసులోని ఆలోచనలను కుటుంబ సభ్యుల ఎదుట ఉంచడంతో వారంతా ఆనందంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ఒకే పెండ్లిపత్రికను ముద్రించి బంధుమిత్రులకు అందచేశారు.
రెండు రోజుల పాటు...
రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా నోఖా మండలంలోని లా్మదేసర్ గ్రామానికి చెంది. సూర్జారామ్ గోదారాకు పెళ్లీడుకొచ్చిన 17 మంది మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. దీంతో వీరికందరికీ ఒకే ముహూర్తాన పెళ్లి జరపించారు. ఈ నెల 1వ తేదీన పెళ్లి అయింది. మనవళ్లకు ఒకరోజు, మనవరాళ్లకు మరుసటి రోజు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. రెండు రోజుల పాటు ఆ ఇంటి పెళ్లిసందడి జరిగింది. ఈ నెల 1వ తేదీన ఐదుగురు మనవలకు పెళ్లి జరిపించారు. ఏప్రిల్ రెండో తేదీన 12 మంది మనవరాళ్లకు వివాహం చేశారు. ఈ వివాహ వేడుకను చూసేందుకు బంధువులు మాత్రమే కాదు చుట్టపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలి వచ్చారు. ఇది నిజంగా రికార్డు అని చెప్పుకోవాలి.
Next Story