Sun Dec 22 2024 16:19:02 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రి గర్ల్స్ హాస్టల్ కు వెళ్లిన అధికారులు.. 89 మంది మిస్సింగ్
ఆ గర్ల్స్ హాస్టల్ లో ఏమి జరుగుతోంది. మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లిన అధికారులు
ఆ గర్ల్స్ హాస్టల్ లో ఏమి జరుగుతోంది. మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీకి వెళ్లిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ఆ హాస్టల్ లో 100 మంది బాలికలు ఉండాల్సి ఉండగా.. 89 మంది కనిపించకుండా పోయారు. దీంతో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ వార్డెన్తో సహా నలుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఒక ఉన్నత అధికారి తెలిపారు.
కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను సోమవారం రాత్రి తనిఖీ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. "అక్కడ మొత్తం 100 మంది బాలికలు ఉండాలి, కానీ పాఠశాలలో కేవలం 11 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. 89 మంది బాలికలు కనిపించడం లేదు. ఎక్కడి వెళ్లారో.. ఏమయ్యారో అనే విషయం గురించి వార్డెన్ సరితా సింగ్ను అడిగితే సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు’’ అని డీఎం చెప్పారు.
“ఇది తీవ్రమైన నిర్లక్ష్యం. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ పద్ధతిలో నడపకూడదు’’ అని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీఎం ఆదేశించారు. పాఠశాల వార్డెన్, ఫుల్టైమ్ టీచర్, వాచ్మెన్, గేట్ డ్యూటీకి కేటాయించిన ప్రాంతీయ రక్షా దళ్ (పీఆర్డీ) జవాన్పై తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి (బీఎస్ఏ) ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని, డ్యూటీలో ఉన్న గార్డుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
Next Story