Wed Apr 02 2025 01:23:37 GMT+0000 (Coordinated Universal Time)
Ayyappa : అయ్యప్ప ఆదాయం ఈ ఏడాది ఇంత పెరగిందా?
శబరిమలలో స్వామి అయ్యప్పకు ఈ ఏడాది ఆదాయం అధికంగా వచ్చింది

శబరిమలలో స్వామి అయ్యప్పకు ఈ ఏడాది ఆదాయం అధికంగా వచ్చింది. ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం ఈ మేరకు ఆదాయం వివరాలను వెల్లడించింది. ఈ సీజన్ లో శబరిమల తీర్థయాత్ర సీజన్ ఆదాయం గతం కంటే ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. మండల, మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్లో శబరిమల ఆలయం రికార్డు స్థాయిలో రూ.440 కోట్లు ఆర్జించింది. ఈ సీజన్లో 5,309,906 శబరిమల ఆలయాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. మండల పూజల నుంచి సంక్రాంతి జ్యోతి దర్శనం వరకూ అత్యధికసంఖ్యలో భక్తులు వచ్చారు.
భక్తుల సంఖ్య కూడా...
గత ఏడాదితో పోలిస్తే 6,32,308 మంది భక్తులు పెరిగారని, తీర్థయాత్రకు పెరుగుతున్న ఆదరణను ఎత్తిచూపుతూ దేవాదాయ మంత్రి వీఎన్ వాసవన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మొత్తం సందర్శకులలో 10,03,305 మంది భక్తులు స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకున్నారు. వర్చువల్ క్యూ మరియు స్పాట్ బుకింగ్ సిస్టమ్ ద్వారా రోజుకు 90,000 నుండి 1,08,000 మంది భక్తులకు వసతి కల్పించామన్నార. ఇది ప్రణాళికాబద్ధమైన 80,000 సామర్థ్యాన్ని మించిపోయిందని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది.
ప్రసాదం ఆదాయం కూడా...
అత్యధిక ఒకేరోజు 1,08,800 మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు ఇక ప్రసాదం ద్వారా 192 కోట్ల రూపాయలు ఈ ఏడాది వచ్చిందని, అదే అరవణ విక్రయాల ద్వారా గత ఏడాది 147 కోట్లు వచ్చిందని ట్రావెన్ కోర్డు బోర్డు తెలిపింది. ఇక అయ్యప్పను దర్శించుకున్న భక్తులు హుండీల విరాళం రూపంలో 126 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. గత ఏడాది ఇది కేవలం 106 కోట్లు మాత్రమేనని వారు వివరించారు. 8. హుండీ విరాళాలు: రూ. 126 కోట్లు అందించారు, అ ఇదే కాలానికి గత సంవత్సరం ఆదాయం రూ. 360 కోట్ల రూపాయలు రాగా ఈ ఏడాది అది 440 కోట్లకు చేరుకుంది. ఈ ఆదాయంతో ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Next Story