Fri Dec 20 2024 10:29:45 GMT+0000 (Coordinated Universal Time)
Sweeper : స్పీపర్ కు కోట్ల ఆస్తులు .. తొమ్మిది లగ్జరీ కార్లు.. మైండ్ బ్లాంక్ అవుతుందిగా?
ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక స్పీపర్ కోటీశ్వరుడయ్యాడు. తొమ్మిది లగ్జరీ కార్లతో పాటు కోట్ల రూపాయల నగదును కూడా సంపాదించాడు.
ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక స్పీపర్ కోటీశ్వరుడయ్యాడు. తొమ్మిది లగ్జరీ కార్లతో పాటు కోట్ల రూపాయల నగదును కూడా సంపాదించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండా ిజల్లాకు చెందిన సంతోష్ జైశ్వాల్ గోండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. తర్వాత సంతోష్ జైశ్వాల్ స్వీపర్ గా ప్రమోషన్ పొందాడు. అయితే మనోడు వీధులను శుభ్రం చేసే పనితో పాటు కమిషనర్ కార్యాయంలోని ఫైళ్లను కూడా దులిపేసి, వాటిని తారుమారు చేసి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించినట్లు అధికారుల విచారణలో వెల్లడయింది.
ఫైళ్లను తారుమారు చేసి...
ఫైళ్లు తారుమారయిన విషయం బయటకు పొక్కడంతో కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఇందులో సంతోష్ జైశ్వాల్ హస్తం ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సంతోష్ జైశ్వాల్ ఆస్తులను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. సంతోష్ సోదరుడు, భార్య పేరిట తొమ్మిది లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు నివేదిక సమర్పించగా వెంటనే సంతోష్ జైశ్వాల్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. సంతోష్ బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక స్వీపర్ ఇలా కోట్లకు పడగలెత్తడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Next Story