Fri Nov 22 2024 14:17:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫుడ్ లవర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీయేనట.. సెకనుకు రెండు బిర్యానీలు
ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీయేనట. స్విగ్గీ నిర్వహించిన సర్వేలో..
బ్రతికేందుకు ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆహారం తినడం కూడా అంతే ముఖ్యం. మన దైనందిన జీవితంలో అది చాలా ముఖ్యమైనది. ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఇష్టమైన ఆహారం తినాలనిపించినపుడు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నిమిషాల్లో మనమున్న ప్రదేశానికి వాటి ఏజెంట్లు తెచ్చిస్తారు. అయితే.. మన దగ్గర ఆన్లైన్లో చాలా రకాల భారతీయ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకూ కొత్తకొత్తరకాల వంటకాలు ఆన్లైన్ డెలివరీకి అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీయేనట. స్విగ్గీ నిర్వహించిన సర్వేలో.. వరుసగా ఏడవ ఏడాది కూడా యాప్లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన డిష్గా చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ల ద్వారా అమ్ముడుపోతున్నాయంటే.. సుమారుగా సెకనుకు 2.28 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నట్లు స్విగ్గీ నివేదిక వెల్లడించింది. చికెన్ బిర్యానీ తర్వాత.. అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్స్ లో మసాలా దోస ఉంది. నెక్ట్స్ చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ రుచులతో పాటు అంతర్జాతీయ రుచులను కూడా భారతీయులు బాగానే లాగించేస్తున్నారని తెలుస్తోంది. వీటితోపాటు పిజ్జా, సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ రామెన్, ఇటాలియన్ పాస్తా టాప్ 10 లిస్టులో ఉన్నాయి. మిడ్ నైట్ ఆర్డర్స్ లో రాత్రి 10 గంటల తర్వాత.. గులాబ్ జామూన్ 27లక్షల, 22 లక్షల ఆర్డర్లతో పాప్కార్న్ టాప్ లో ఉన్నాయి.
- Tags
- swiggy
- 2022 foods
Next Story