Mon Nov 25 2024 22:40:48 GMT+0000 (Coordinated Universal Time)
తంజావూరు రథోత్సవంలో తీవ్ర విషాదం.. భక్తులు సజీవదహనం
ఆలయ రథానికి కరెంట్ వైర్ తగిలడంతో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం..
చెన్నై : తంజావూరు రథోత్సవంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లా కలైమేడులో ఆలయ ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న విద్యుదాఘాతంతో 11 మంది మరణించారు.. 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయ రథానికి కరెంట్ వైర్ తగిలడంతో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రథం మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. PTI ప్రకారం, గాయపడిన ముగ్గురు వ్యక్తులను తంజావూరు మెడికల్ కాలేజీలో చేర్చారు. ఈ ప్రమాదంలో రథం పూర్తిగా కాలిపోయింది.
కలిమేడు ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకలో భాగంగా రథాన్ని లాగుతారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. గత రాత్రి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో తంజావూరు-పుతలూరు రహదారి పక్కన రథం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుదాఘాతంతో మంటలు అంటుకోవడంతో భక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story