Sat Dec 21 2024 01:50:14 GMT+0000 (Coordinated Universal Time)
తిన్నోళ్లకు తిన్నంత మటన్.. ఇక్కడకు వాళ్లకు మాత్రమే ప్రవేశం
తమిళనాడులో మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకాలతో భోజనాలను పెడతారు. ఇది ఏటా తమిళనాడులో జరుగుతుంది
తమిళనాడులో మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకాలతో భోజనాలను పెడతారు. ఇది ఏటా తమిళనాడులో జరుగుతుంది. ఈ జాతరకు కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మహిళలకు ప్రవేశం లేదు. తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలోని కరుప్పారై ముత్తయ్య ఆలయంలో ఏటా ఈ జాతర నిర్వహిస్తారు. దీనికి కిడా విరుందు అని కూడా పిలుస్తారు. పూర్తి మాంసాహార వంటకాలను సిద్ధం చేస్తారు. జాతరకు ముందు మొక్కుకున్న మేకపోతులను కోసి మటన్ చేస్తారు. ఈ జాతరలో వందకు పైగా మేకపోతులను నైవేద్యంగా స్వామి వారికి సమర్పించిన అనంతరం వంటకాలను సిద్ధం చేస్తారు.
పురుషులకు మాత్రమే...
అయితే ఈ జాతరకు కేవలం పురుషులు మాత్రమే రావాల్సి ఉంటుంది. మహిళను రానివ్వరు. అందుకే జిల్లాలోని నలుమూలల నుంచి ఈ జాతర కోసం పెద్దయెత్తున పురుషులు తరలి వచ్చి నాన్ వెజ్ వంటకాలను కడుపారా భుజిస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవానికి పెద్దయెత్తున భక్తులు రావడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ జాతరకు వచ్చిన వారికి తిన్నవారికి తిన్నంత వడ్డిస్తారు. లేదని అనరు. ఇక చాలు అన్నంత వరకూ భోజనాలు వడ్డించడం ఈ జాతరలో ప్రత్యేకత. సంవత్సరం పాటు పెంచిన మేకపోతులను బలి ఇచ్చిన అనంతరం తయారుచేసే వంటకాలను పురుషులే చేస్తారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవాలంటే విందు పూర్తయిన తర్వాత మాత్రమే రావాల్సి ఉంటుంది. తాము తిన్న విస్తళ్లు కూడా పురుషులు తీయరు. అవి పూర్తిగా ఎండిపోయే వరకూ స్త్రీలు ఆ దరిదాపులకు రాకూడదని సంప్రదాయంగా వస్తున్న ఆచారం.
Next Story