Sun Dec 22 2024 18:00:22 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ.. నీట్ ను రద్దు చేయాలంటూ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వివిధ రాష్ఠ్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వివిధ రాష్ఠ్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. నీట్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాలని కోరారు. నీట్ వల్ల రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తమిళనాడులో నీట్ ను మినహాయించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
వివిధ రాష్ట్రాల సీఎంలకు...
మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాలని స్టాలిన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ మీ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
Next Story