Mon Mar 24 2025 07:58:30 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నైవాసులకు గుడ్ న్యూస్.. ఉచిత ప్రయాణం
చెన్నైలో జరగనున్న టీ 20 మ్యాచ్ కు మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లండ్ - భారత్ ల మధ్య టీ 20 సిరీస్ జరుగుతుంది. తొలి టీ 20 నేడు కోల్ కత్తా లో జరగుతుండగా, రెండో మ్యాచ్ ఈ నెల 25వ తేదీన చెన్నైలో జరుగుతుంది. దీంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న రెండో టీ 20 మ్యాచ్ కు మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులందరూ మెట్రోలో ఆరోజు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
మెట్రో రైలులో...
అయితే చెపాక్ స్టేడియంలో టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. చెపాక్ స్టేడియానికి ఆరోజు వెళ్లేందుకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే చెన్నైలో శనివారం నాడు జరిగే రెండో టీ 20 మ్యాచ్ కోసం టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ గుడ్ న్యూస్ క్రికెట్ అసోసియేషన్ చెప్పింది.
Next Story