Fri Nov 22 2024 20:36:15 GMT+0000 (Coordinated Universal Time)
పీచుమిఠాయిపై తమిళనాడులో నిషేధం
పీచుమిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిింది.
పీచు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న నాటి రోజులు గుర్తుకు తెచ్చే పీచుమిఠాయి తమిళనాడులో తీపి గుర్తుగా మిగిలిపోనుంది. పీచుమిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిింది. పీచు మిఠాయి తమిళనాడులో విక్రయిస్తే ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పీచు మిఠాయిని కాటన్ క్యాండీగా పిలుస్తారు. అయితే ఇందులో క్యాన్సర్ కారక రసాయనాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడంతో తమిళనాడు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది.
క్యాన్సర్ కారకాలు...
ఇటీవల చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టే అధికారులు వాటినాణ్యతను పరిశీలించారు. ఇక్కడ తయారవుతున్న పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగులు వేయడం కోసం దీనిని వినియోగిచినట్లు తేలింది. ఇది వస్త్రాలకు రంగులు వేయడం, పేపర్ ప్రింటింగ్ లో వినియోగిస్తారు. అందుకే దీనిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరు తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Next Story