Fri Nov 22 2024 23:05:01 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడు వణికింది.. ఇంకా వణుకుతూనే ఉంది
మిచౌంగ్ తుఫాను దెబ్బకు తమిళనాడు వణికిపోయింది. తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మరణించారు
మిచౌంగ్ తుఫాను దెబ్బకు తమిళనాడు వణికిపోయింది. తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది మరణించారు. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే జరిగిందని ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఖరీదైన కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తుఫాను దెబ్బకు చెన్నై నగరంతో పాటు అనేక జిల్లాల్లో భారీవర్ష పాతం నమోదయింది. పెరుంబాక్కం, షోలింగనల్లూర్, కరపాక్కం, మేడిపాక్కం, రామ్ నగర్లతో సహా చెన్నైలోని వెలచ్చేరి ప్రాంతంలోని ప్రజలు ఇప్పటికీ భయాందోళనలతో గడుపుతున్నారు.
తాగు నీరు అందక...
అనేక మందికి తాగు నీరు అందడం లేదు. తినడానికి తిండి లేదు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు బయటకు తీసుకువస్తున్నప్పటికీ వారు తమను ఎవరూ ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడవలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. గేటెడ్ కమ్యునిటీలలోకి నీరు భారీగా చేరడంతో వారంతా బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు సౌకర్యంలేకపోవడంతో అల్లాడి పోతున్నారు. రేపటికి కాని సాధారన పరిస్థితులు నెలకొనే అవకాశం లేదు.
Next Story