Mon Dec 23 2024 16:12:06 GMT+0000 (Coordinated Universal Time)
టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా... ఈ నెలలోనే?
ఈ నెల 27న ఎయిర్ ఇండియాకు సంబంధించి పూర్తి వాటాను టాటా సంస్థకు అప్పగిస్తారు.
ఎయిర్ ఇండియాను టాటా సంస్థ తన చేతుల్లోకి తీసుకోనుంది. ఈ నెల 27న ఎయిర్ ఇండియాకు సంబంధించి పూర్తి వాటాను టాటా సంస్థకు అప్పగిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను టాటా సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అధికారిక బదలాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే పూర్తి వాటాలను ఈ నెల 27వ తేదీన అప్పగించేందుకు ప్రభుత్వం సిద్దమయింది.
అధికారిక బదలాయింపు....
ఎయిర్ ఇండియా పూర్తిగా అప్పుల్లో ఉండటంతో గత ఏడాది బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్ లో టాటా సంస్థ ఎయిర్ ఇండియాను చేజిక్కించుకుంది. ఎయిర్ ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లోని కార్గో సేవలను కూడా టాటా సంస్థ వంద శాతం వాటాను చేజిక్కించుకుంది. ఇప్పటికే టాటా సంస్థ విస్తారా, ఎయిర్ ఏషియాలో అధిక వాటాలను కలిగి ఉంది.
Next Story