Mon Dec 23 2024 03:08:01 GMT+0000 (Coordinated Universal Time)
Message Delete: వాట్సాప్ లో వినాయక చవితి శుభాకాంక్షలు డిలీట్.. అరెస్ట్
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు
రాజస్థాన్లోని కోట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్లో గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన పలు పోస్టులను అతడు డిలీట్ చేసినందుకు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాటూరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కమిటీకి వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో గ్రామస్థులు కూడా ఉన్నారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామంలోని ఒక వ్యక్తి గ్రూప్లో పోస్ట్ పెట్టాడు. అయితే స్కూల్ ప్రిన్సిపాల్ షఫీ మహ్మద్ అన్సారీ ఆ మెసేజ్ను తొలగించాడు. రెండు గంటల తర్వాత ఒక ఉపాధ్యాయుడు కూడా హ్యాపీ వినాయక చవితి అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు. దాన్ని కూడా ప్రిన్సిపాల్ డిలీట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అన్సారీని విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై అన్సారీని అరెస్టు చేశారు.
Next Story