Mon Dec 23 2024 06:24:39 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్క పోస్టుకు 8 కోట్లు.. కొహ్లి ఆదాయం
టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లికి అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదే ఆయనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది
టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లికి అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదే ఆయనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కొహ్లి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు పెడితే పది లక్షల డాలర్లను అందుకుంటున్నారు. అంటే భారత్ కరెన్సీలో దీని విలువ ఎనిమిది కోట్ల రూపాయలు. ఆసియా ఖండంలోనే కొహ్లి ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదించే వారిలో ప్రధమ స్థానంలో నిలిచాడు. హోపర్క్ డాట్ కామ్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫాలోవర్స్ ఉండటంతో...
విరాట్ కొహ్లికి ఇన్స్టాగ్రామ్ లో ిఇరవై కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ పోస్టు వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఒక్క పోస్టుకు ఎనిమిది కోట్లు చెల్లిస్తుంది. ఇలా ఆదాయం సంపాదించే వాళ్లలో భారతీయులు మరెవరూ లేరు. కొహ్లి ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలక్టర్లు కొహ్లిని దూరంగా ఉంచారు. అయినా కొహ్లి అభిమానులు ఆయనంటే పడి చచ్చి పోతారు. కొహ్లి ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే కొహ్లికి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచలోనూ అభిమానులు ఉన్నారు.
Next Story