Sun Dec 22 2024 11:59:39 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ యూపీఏలో కీలకమైన నేత
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. శరద్ పవార్ యూపీఏలో కీలకమైన నేత. ఒయన పేరు ఒక దశలో ప్రధానమంత్రి పదవికి కూడా విన్పించింది. దేశ రాజకీయాలపై చర్చించేందుకు త్వరలోనే హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. శరద్ పవార్, కేసీఆర్ ల మధ్య దాదాపు గంటన్నర సేపు సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో శరద్ పవార్ మద్దతిచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తేనే దేశంలో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ సహకారం అవసరమన్నారు.
హైదరాబాద్ రావాలని....
ఉద్ధవ్ థాక్రేతో భేటీ ముగిసిన అనంతరం శరద్ పవార్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీయేతర పార్టీలతో కలసి కూటమిగా ఏర్పడేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ కు రావాలని ఉద్ధవ్ థాక్రే ను కోరిన కేసీఆర్ శరద్ పవార్ ను కూడా హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ లో సమావేశం తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
- Tags
- kcr
- sharad pawar.
Next Story