కాంగ్రెస్లో చేరాలంటే ముందుగా ఆయనను కలవాల్సిందే..!
దేశంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఇక..
దేశంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్పీడు పెంచింది. ఇక తెలంగాణలో మాత్రం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం ఉండాలి కదా..! అన్నట్లు తనదైన శైలిలో అడుగులు వేస్తోంది కాంగ్రెస్. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలను తమ పార్టీలోకి లాగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మంచి బలమున్న నాయకులపైనే కన్నేసి ఎలాగోలా పార్టీలోకి రప్పించేలా ఎత్తుగడలు వేస్తోంది. ఇక ఈ మాట అటుంచితే.. డీకే శివకుమార్ అనే పేరు మీరు వినే ఉంటారు. కన్నడనాట కాంగ్రెస్ విజయం తర్వాత ఆయన లెవల్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
పార్టీలో పెరిగిన ఆయన గ్రాఫ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏం చెప్పినా జరిగి తీరాల్సిందే. అందుకే తెలంగాణ నేతలు సైతం ఆయనను ముందుగా ప్రసన్నం చేసుకుంటున్నారు. మరి ఢిల్లీ పెద్దలను కాకుండా బెంగళూరులో ఆయనను కలుసుకోవడం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆయన అంత క్రేజ్ ఎందుకు పెరిగిందనేది అందరిలో నెలకొంటున్న ఆసక్తి. పార్టీలలో కొందరు ఏది చెప్పినా అది క్షణాల్లోనే జరిగిపోతుంటుంది. అలాంటి వారిలో డీకే శివకుమార్ కూడా. ఆయనకు అపారమైన అనుభవమే కాకుండా మంచి పలుకుబడి కూడా ఉంది. ఏదైనా చేయగలిగి సామర్థ్యం ఉన్న వ్యక్తి. దక్షణాధిలో కాంగ్రెస్ ఏం చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉండి తీరాల్సిందే.