Mon Dec 23 2024 10:18:39 GMT+0000 (Coordinated Universal Time)
రిలయన్స్ జియో రికార్డు
తెలుగు రాష్ట్రాల్లో జియో కొత్త సభ్యులను చేర్చుకుని రికార్డు నెలకొల్పిందని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ తెలిపింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో జియో కొత్త సభ్యులను చేర్చుకుందని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3.27 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుందని ట్రాయ్ తెలిపింది. అత్యధికంగా కొత్త జియో చందాదారులను అత్యధికంగా రిలయన్స్ జియో చేర్చుకుందని తెలిపింది. మే నెలలోనే భారతి ఎయిర్టెల్ 71,312 చందాదారులను చేర్చుుంది. వోడాఫోన్ ఐడియాకు 74,808 మంది వినియోగదారులను కోల్పోయిందని ట్రాయ్ తాజా నివేదికలో పేర్కొంది. అలాగే మే నెలలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి 78,423 మంది వినియోగదారులు వైదొలిగారని తెలిపింది.
ఆధిపత్యం దిశగా...
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియోకు ఒక్క మే నెలలో 31.11 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్ లను సంపాదించిందని ట్రాయ్ తెలిపింది. దీంతో భారతీయ టెలికాం మార్కెట్ లో మే నెలలో రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని చూపించిందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరుకుందని ట్రాయ్ వెల్లడించింది. ద్వితీయ స్థానంలో భారతీ ఎయిర్ టెల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరిందని పేర్కొంది. మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా 25.84 కోట్లకు చేరుకుందని తెలిపింది. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 11.28 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని ట్రాయ్ వెల్లడించింది.
Next Story