Mon Dec 23 2024 13:37:07 GMT+0000 (Coordinated Universal Time)
మణిపూర్లో తెలుగు విద్యార్థులు
మణిపూర్లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారు రాష్ట్రం విడిచి బయటకు వచ్చేందుకు వీలులేక అవస్థలు పడుతున్నారు.
మణిపూర్లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారు రాష్ట్రం విడిచి బయటకు వచ్చేందుకు వీలులేక అవస్థలు పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంపాల్ ఎన్ఐటీలో వంద మంది వరకూ తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. అక్కడే ఉండి తమ చదువును కొనసాగిస్తున్నారు.
ఎన్ఐటీలో చదువుకుంటూ...
అయితే గత కొద్ది రోజులుగా మణిపూర్లో గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల వివాదం అంటుకుంది. ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరగడంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. తినడానికి తిండి కూడా లేదని తెలుగు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా వీడియోను విడుదల చేశారు. ప్రభుత్వాలు వెటనే జోక్యం చేసుకుని మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రాలకు తరలించాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
Next Story