Fri Dec 20 2024 14:08:19 GMT+0000 (Coordinated Universal Time)
బురఖాతో తిరుగుతున్న ఆలయ పూజారి.. పట్టుకుని అడగడంతో
కోయిలాండీ జంక్షన్ లో బురఖా ధరించి తిరుగుతున్న అతడిని ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు
కేరళలోని కోయిలాండి వీధుల్లో తిరుగుతున్న ఆలయ పూజారిని స్థానికులు పట్టుకున్నారు. అయితే అతడు బురఖా ధరించి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 'చికెన్ పాక్స్' ఉన్నందున బురఖా ధరించినట్లు అతడు చెప్పాడు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తిని పూజారి జిష్ణు నంబూతిరి (28) గా గుర్తించారు. అయితే, ప్రాథమిక పరీక్షలో అతడిలో చికెన్ గున్యా లక్షణాలు కనిపించలేదని పోలీసులు ఆదివారం తెలిపారని పిటిఐ నివేదించింది.
మెప్పయూర్ సమీపంలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న జిష్ణు నంబూతిరిని అక్టోబర్ 7న కోయిలాండి జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్లు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. "బురఖా ధరించి తిరుగుతున్నాడని గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయితే, అతనిపై ఎలాంటి నేరం చేసినట్లు ఫిర్యాదు లేదు. అతని బంధువులు పోలీసు స్టేషన్కు చేరుకున్న తర్వాత అతన్ని విడిచిపెట్టాము" అని వారు చెప్పారు. వారు అతని పేరు, చిరునామా, ఇతర వివరాలను ధృవీకరించి విడిచిపెట్టినట్లు పోలీసులు PTIకి తెలిపారు.
అక్టోబరు 7న కోయిలాండీ జంక్షన్ లో బురఖా ధరించి తిరుగుతున్న అతడిని ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బురఖా ఎందుకు ధరించావని పోలీసులు ప్రశ్నించగా, తనకు చికెన్ పాక్స్ వ్యాధి సోకిందని, అందుకే బురఖా ధరించి తిరుగుతున్నానని ఆ పూజారి బదులిచ్చాడు. ఆ పూజారిపై ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసులు తెలిపారు. అతడి బంధువులు వచ్చి తమవాడే అని చెప్పడంతో వివరాలు నమోదు చేసుకుని విడిచిపెట్టారు.
Next Story