Mon Dec 23 2024 12:14:54 GMT+0000 (Coordinated Universal Time)
మస్క్ పేల్చిన ఈవీఎం బాంబ్.. భారత్ లో పేలిందిగా?
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు
ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ట్విట్టర్ అధినేత అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత్ లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిపలో పెట్టుకుని ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ చేసినా ఇప్పుడు భారత్ లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చనీయాంశంగా మారింది.
అలాంటిదేమీ లేదన్న...
ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనీని ఎలాన్ మస్క్ తెలిపారు. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ద్వారా అయినా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే ఎలాన్ మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొట్టిపారేశారు. మస్క్ చెబుతున్నదానిలో నిజం లేదన్నారు. మస్క్ భారత్ కు వచ్చి ఈవీఎం వినియోగం గురించి నేర్చుకోవాలని సూచించారు.
Next Story