Mon Dec 23 2024 08:52:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సిందే : సుప్రీం
ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ. 92.94 కోట్లను వారంలో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన మొత్తానికి 6 శాతం..
న్యూఢిల్లీ : తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతో సహా వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు అనుమతిని ఇచ్చింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ. 92.94 కోట్లను వారంలో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. మిగిలిన మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల సమయమిచ్చింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం చెప్పింది. తెలుగు అకాడమీ విభజన పూర్తి చేయాలని గతేడాది తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అకాడమీకి చెందిన బ్యాంకు డిపాజిట్ల విత్ డ్రా వార్తలు కలకలం రేపాయి. ఏకంగా రూ. 65 కోట్ల నిధుల గోల్ మాల్ బయటకు వచ్చింది.
Next Story