Mon Dec 23 2024 08:49:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్ లక్ సీఎంగారూ... పార్టీ గెలిచింది కానీ?
ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించింది.
ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించింది. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమి పాలు కావడం విశేషం. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ చంద్ కప్రీపై దాదాపు ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉత్తరాఖండ్ లోని ఖాతిమా నియోజకవర్గం నుంచి ఆయన పోటికి దిగారు.
పూర్తి స్థాయి మెజారిటీతో.....
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 47 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితమయింది. ఇక్కడ పూర్తి స్థాయి మెజారిటీ రావడంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- uttarakhand
- bjp
Next Story