Mon Dec 23 2024 16:04:16 GMT+0000 (Coordinated Universal Time)
యుక్త వయసుకు వచ్చాక పెళ్లి నిర్ణయం పూర్తిగా బాలికదే : పంజాబ్ హై కోర్టు
పంజాబ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యుక్తవయసుకు వచ్చిన ముస్లిం బాలిక.. తన ఇష్టానుసారంగా ఎవరినైనా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.
ఆడపిల్ల వయసుకొచ్చిందంటే చాలు.. వెంటనే పెళ్లి చేసేయాలి అనుకుంటారు పెద్దలు. అంతే తప్ప ఆమెకు ఇంకా చదువుకోవాలన్న కోరిక ఉందా ? అప్పుడే పెళ్లి చేయడం ఇష్టం ఉంటుందా లేదా? కనీసం తాము చూసిన సంబంధం నచ్చిందో లేదో కూడా అడగకుండా పెళ్లిళ్లు చేసేసే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. అదో పెద్ద నేరమన్నట్లే చూస్తారు. ఇంటర్ కాస్ట్ అయితే పర్లేదు కానీ.. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అయితే.. వాళ్లని సమాజంలో మరీ చిన్నచూపు చూస్తుంటారు. ఈ విషయంపైనే పంజాబ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యుక్తవయసుకు వచ్చిన ముస్లిం బాలిక.. తన ఇష్టానుసారంగా ఎవరినైనా వివాహం చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.
రక్షణ కల్పించండి
యుక్త వయసుకు వచ్చిన బాలిక వివాహం విషయంలో జోక్యం చేసుకునే హక్కు బాలిక సంరక్షుడికి ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయం ముస్లిం పర్సనల్ లా లో స్పష్టంగా ఉందని పంజాబ్ హై కోర్టు పేర్కొంది. 17 ఏళ్ల ముస్లిం యువతి ఒక హిందూ బాలుడిని పెళ్లాడింది. కానీ.. బాలిక కుటుంబం ఈ వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ జంట రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ వివాహ వయసు అన్నది ముస్లింల చట్టానికి అనుగుణంగానే ఉందని విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story