Tue Nov 05 2024 16:30:41 GMT+0000 (Coordinated Universal Time)
చాలా రోజుల తర్వాత అక్కడ సరిహద్దులను తెరచిన భారత్
దాదాపు రెండున్నరేళ్ల పాటు మూసివేయబడింది. సశాస్త్ర సీమా బల్ 15వ బెటాలియన్ కమాండెంట్ నీరజ్ చంద్‌తో
అస్సాం సరిహద్దులో ఉన్న సంద్రుప్ జొంగ్ఖార్- గెలెఫు వద్ద ఉన్న భారతదేశం-భూటాన్ సరిహద్దు గేట్లు తెరుచుకున్నాయి. నేటి నుండి పర్యాటకుల కోసం తెరిచారు. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత సరిహద్దులను మూసివేశారు. ఇప్పుడు మొదటిసారిగా సరిహద్దు గేట్లను తిరిగి తెరవాలనే నిర్ణయం తగ్గుతున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గిన సంగతి తెలిసిందే.. అది దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14న భూటాన్ డైరెక్టర్ (లా అండ్ ఆర్డర్) ఆఫ్ హోం అండ్ కల్చరల్ అఫైర్స్, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశం తరువాత, తాషి పంజోర్ మాట్లాడుతూ, "కోవిడ్ కేసులు తగ్గినందున సెప్టెంబర్ 23 న భారతదేశంతో అంతర్జాతీయ సరిహద్దు తెరవబడుతుందని భూటాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మేము సరిహద్దును తెరవడానికి, సందర్శకులకు మంచి అనుభవాన్ని అందించడానికి సిద్ధం చేస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. ఫుయంత్‌షోలింగ్, పారో గేట్లు మాత్రమే కాకుండా పర్యాటకుల కోసం మూడు అదనపు గేట్ల వద్ద అనుమతులు మంజూరు చేయబడతాయని భూటానీ అధికారి తెలియజేశారు.
టూరిజం అభివృద్ధి విషయంలో భూటాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భూటాన్ ప్రభుత్వం పర్యాటకుల కోసం ఎకో-టూరిజం, పక్షులను చూడటం, ఇతర ప్యాకేజీలను ప్లాన్ చేస్తోంది. సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి Substantial Development Fund (SDF) ని వసూలు చేస్తుంది. సందర్శకులకు ₹1200 ఛార్జ్ చేయబడుతుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్-భూటాన్ సరిహద్దు దాదాపు రెండున్నరేళ్ల పాటు మూసివేయబడింది. సశాస్త్ర సీమా బల్ 15వ బెటాలియన్ కమాండెంట్ నీరజ్ చంద్‌తో తాషి పెంజోర్ మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల మధ్య సరిహద్దులను మూసివేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు.
Next Story