Mon Dec 23 2024 01:24:54 GMT+0000 (Coordinated Universal Time)
టైమ్స్ నౌ సర్వే: వీరికి షాక్.. వారిలో జోష్
టైమ్స్ నౌ ETG ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి
టైమ్స్ నౌ ETG ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచిన ప్రధాని మోదీయే అవుతారని సర్వేలో తేలింది. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సర్వే వచ్చింది. 2024లో కూడా ఆయనే ప్రధాని అవుతారని స్పష్టంగా సర్వేలో తెలుస్తోంది.
ETG ఒపీనియన్ పోల్ ప్రకారం, BJP 300 సీట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేశారు. విపక్షాల INDIA కూటమి 160-190 సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. NDA దాదాపు 296-326 సీట్లు సాధించవచ్చని సర్వే అంచనా వేసింది.. అయితే 2019లో వచ్చిన 353 సీట్ల కంటే కాస్త ఎక్కువే..! రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి సవాలుగా నిలిచేందుకు ప్రతిపక్ష పార్టీల INDIA కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని సర్వే తెలిపింది. NDA ప్రభుత్వాన్ని అధికారం నుండి తప్పించడానికి ఈ ప్రయత్నాలు సరిపోకపోవచ్చని సర్వే చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనుందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మొత్తం 25 సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని కూడా పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. ఏపీలో వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని, 51.3 శాతం ఓట్ల శాతంతో మొత్తం 25 ఎంపీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే తెలిపింది. టీడీపీ ఒక్క ఎంపీ సీటు దక్కితే దక్కొచ్చని ఈటీజీ టైమ్స్ నౌ సర్వే తెలిపింది. ఈ సర్వేలో జనసేన కు ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చని తెలిపింది. 2019లో ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు గానూ.. వైఎస్సార్సీపీ 22 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది.
ఇక తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ బీఆర్ఎస్ 9-11 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీ(ఎన్డీయే కూటమికి) 2-3 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 3-4 ఎంపీ స్థానాలు, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీ(బీ)ఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానం నెగ్గాయి.
Next Story