రాహుల్‌తో గాంధీతో ఉన్న యువతి ఆమె కాదట.! బిగ్ రిలీఫ్?
రాహుల్ గాంధీలో నైట్‌క్లబ్ పార్టీలో ఉన్నది చైనా రాయబారి హౌ యాంకీ అని జరిగిన ప్రచారం వాస్తవం కాదని తేలింది.
కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పొరుగుదేశం నేపాల్ రాజధాని ఖాట్మండులోని నైట్‌క్లబ్‌లో యువతితో ఉన్న వీడియోలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. వీడియోలో రాహుల్‌తో ఉన్న యువతి నేపాల్‌లో చైనా దౌత్య అధికారి హౌ యాంకి అని ప్రచారం సాగింది. గతంలో చైనా హనీ ట్రాప్ వ్యవహారం కూడా తెరమీదకు వచ్చింది. నేతలను హనీట్రాప్ చేసిన ఘటనలను కొందరు ప్రతిపక్ష నేతలు గుర్తు చేశారు కూడా.
సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఆ వీడియోలు తీవ్ర దుమారం రేపడంతో అసలు రాహుల్ గాంధీతో ఉన్న ఎవరనే ఆసక్తి రేగింది. నిజంగానే రాహుల్ చైనా రాయబారితో ఉన్నారా? ఆమెతో ఏం మాట్లాడారనే ప్రశ్నలు కూడా కొందరు ప్రతపక్ష నేతలు సంధించారు. అయితే ఈ వ్యవహారంపై ఓ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె చైనా రాయబారి కాదని తేలిందట. రాహుల్‌తో ఉన్నది హౌ యాంకీ కాదని.. స్నేహితురాలని తేల్చారు.
రాహుల్ గాంధీ తన జర్నలిస్ట్ మిత్రురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు ఖాట్మండు వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన పార్టీకి రాహుల్ వెళ్లారని.. ఆయనతో ఉన్నది జర్నలిస్ట్ సుమ్నిమా స్నేహితురాలని.. ఐదారుగురు స్నేహితులతో కలిసి రాహుల్ నైట్‌క్లబ్‌లో పార్టీకి వెళ్లారని సమాచారం. పార్టీకి చైనీయులు ఎవరూ రాలేదని నైట్ క్లబ్ యజమాని చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రాహుల్‌తో ఉన్నది చైనా రాయబారి కాదని తేలడంతో ఆ పార్టీ శ్రేణులకు బిగ్ రిలీఫ్ దొరికినట్టైంది.