Sun Dec 22 2024 13:51:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇండిగో విమానంలో మహిళకు వేధింపులు
ఇండిగో విమానంలో మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇండిగో విమానంలో మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక వ్యక్తిని వేధింపుల కింద అరెస్ట్ చేశారు. ఢిల్లీ - చెన్నై ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన వెనకాల కూర్చున్న వ్యక్తి తన శరీరాన్ని తాకాడని విమానసిబ్బందికి మహిళ ఫిర్యాదు చేసింది.
నిందితుడి అరెస్ట్...
చెన్నైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఈ ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ వ్యక్తిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో ఈ ఘటన జరిగింది. వేధింపులకు గురిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story