Mon Dec 23 2024 09:24:59 GMT+0000 (Coordinated Universal Time)
న్యూయార్క్ లో అతి ఖరీదైన హోటల్ అంబానీ సొంతం
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రముఖ హోటల్ ను అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రముఖ హోటల్ ను అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూయార్క్ నగరంలో మాండరీయన్ ఓరియంటల్ హోటల్ ప్రముఖమైనది. దీనిని అంబానీ 98.15 మిలియన్లను వెచ్చించి కొనుగోలు చేశారు.
అత్యధిక వాటాను....
73.37 శాతం వాటాతో ఈ హోటల్ ను అంబానీ కొనుగోలు చేశారు. అత్యంత విలాసవంతమైన హోటల్ లో వాటా ఉన్న కేమాన్ ఐలాండ్స్ సంస్థ వాటాను అంబానీ కొనుగోలు చేశారు. దీంతో న్యూయార్క్ లోని ఈ హోటల్ అంబానీ సొంత మైంది. 2003లో ఈ హోటల్ ను స్థాపించారు. అనేక అవార్డులను గెలుచుకున్న ఈ హోటల్ ను అంబానీ సొంతం చేసుకోవడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Next Story