Mon Dec 23 2024 20:23:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వేరియంట్ భారత్ లోకి వచ్చినట్లేనా?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముంబయికి సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి కరోనా 19 పాజిటివ్ గా తేలడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో ఒక వ్యక్తికి కరోనా 19 పాజిటివ్ గాత ేలింది. అయితే ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది ఇంకా వైద్య నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. పరీక్షల నిమిత్తం ఆ వ్యక్తి రక్తనమూనాలను ల్యాబ్ కు పంపారు. ప్రస్తుతం సదరు వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు.
ఒమిక్రాన్ వేరియంట్ తో....
సౌతాఫ్రికా లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాలపై అనేక దేశాలు ఆంక్షలను విధించాయి. భారత్ కూడా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా 19 పాజిటివ్ గా తేలడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. కర్ణాటకలోనూ ఇదే తరహా కేసులు వెలుగు చూశాయి.
Next Story