Mon Dec 23 2024 19:33:48 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం
రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాత్ కు మద్దతుగా నిలిచారు
రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాత్ కు మద్దతుగా నిలిచారు. గవర్నర్ కు కొందరు ఇప్పటికే రాజీనామాలు ఇచ్చినట్లు సమాచారం. నిన్న కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశమై సచిన్ పైలట్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. సచిన్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఒప్పుకోమని వారు హెచ్చరికలు పంపారు. అర్ధరాత్రి స్పీకర్ కు రాజీనామాలు ఇవ్వడం పార్టీలో సంక్షోభానికి తెరలేపింది.
పైలట్ కు వ్యతిరేకంగా...
అశోక్ గెహ్లాత్ ను సీఎం పదవిగా కొనసాగించాలని అసంతృప్త ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సచిన పైలట్ ను తాము ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని కూడా వారు తేల్చి చెబుతున్నారు. అశోక్ గెహ్లాత్ కాకుంటే తమలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడాలని అధిష్టానం పరిశీలకుడిగా వెళ్లిన మల్లికార్జున ఖర్గే, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి అజయ్ మాకెన్ లను కోరింది.
Next Story