Mon Dec 23 2024 02:59:58 GMT+0000 (Coordinated Universal Time)
సరిహద్దుల్లో స్వల్ప ఘర్షణ
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు స్వల్పంగా గాయపడినట్లు సమాచాం. వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఘర్షణ జరిగిదంని చెబుతున్నారు. తూర్పు లదాఖ్ ఘర్షణ తర్వాత ఈ తరహా ఘటన జరగడం ఇది మొదటి సారి అని అంటున్నారు.
వాస్తవాధీన రేఖను...
వాస్తవాధీన రేఖను దాటి చైనా సైనికులు చొచ్చుకుని వస్తుండటంతో భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య కొంత ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగానే సైనికుల్లో కొందరికి స్వల్పగాయాలయ్యాయని చెబుున్నారు. ఆ తర్వాత ఇరు దేశాలు ఫ్లాగ్ మీటింగ్ ను నిర్వహించాయి. ప్రస్తుతం ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కు రప్పించినట్లు సమాచారం
Next Story