Fri Dec 20 2024 01:17:50 GMT+0000 (Coordinated Universal Time)
హేమంత్ సోరెన్ డబుల్ యాక్షన్... ఇద్దరు అచ్చుగుద్దినట్లు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాంటి వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయన హేమంత్ సోరెన్ ను కలిశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లాంటి వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయన హేమంత్ సోరెన్ ను కలిశారు. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకలానే ఉండటంతో ఎవరు హేమంత్ సోరెన్? ఎవరు కాదు? అని చూసిన వారికి ఎవరికైనా అనుమానం కలుగుతుంది. రాంచీకి చెందిన మున్నా లోహ్రా అచ్చం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్లా కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయన నేరుగా హేమంత్ సోరెన్ నివాసానికి వచ్చి ఆయనను కలిశారు.
సోషల్ మీడియాలో షేర్ చేయడంతో...
దీంతో ఇద్దరు కలసి ఉన్న ఫొటోను హేమంత్ సోరెన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ విస్తుపోయి చూస్తున్నారు. ఇదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. హేమంత్ సోరెన్ కూడా ఆ ఫొటోకు హేమంత్ సోరెన్ కలిసిన మరో హేమంత్ సోరెన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది వైరల్గా మారింది. అయితే ఇందులో ఎడమ వైపు ఉన్నది ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కాగా, కుడివైపు ఉన్నది మాత్రం లోహ్రాగా ఆయనే చెప్పారు. చెబితే తప్ప గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్న వీరిద్దరని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే లోహ్రా హేమంత్ సోరెన్ కంటే కొంత ఎత్తు తక్కువగా ఉండటంతో దగ్గరి వారు గుర్తు పట్టొచ్చు.
Next Story