Fri Apr 18 2025 13:08:26 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఇక వేరేవాళ్లు పోటీ చేయడం అనవసరమేమో.. దేశమంతా ఇక కమలమేనా?
దేశంలో ఇక వేరే పార్టీలు పోటీ చేయడం అనవసరం. ఎందుకంటే.. మోదీ దెబ్బకు దేశమంతా కమలం పార్టీనే అధికారంలోకి వస్తుంది

దేశంలో ఇక వేరే పార్టీలు పోటీ చేయడం అనవసరం. ఎందుకంటే.. మోదీ దెబ్బకు దేశమంతా కమలం పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అన్నది పక్కన పెడితే ఇక ఏ ఎన్నికలు జరిగాన మోదీ ముందు ఇతర పార్టీలు మోకరిల్లించాల్సిందే. అనేక విషయాలు బీజేపీ విజయానికి పనిచేస్తాయి. అది బయటకు చెప్పలేనివి కొన్ని అయితే.. మోదీ ఇమేజ్.. పరిపాలన మరికొన్ని కమలం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి. వరసగా కొన్ని దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంటున్న రాష్ట్రాల్లో సయితం బీజీపీ తన హవాను కొనసాగిస్తుంది. ఒక్కటి కాదు. రెండు కాదు దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడనుంది.
స్వీప్ చేస్తున్న బీజేపీ...
వేరే వాళ్లకు అవకాశం లేదనిపిస్తుంది. ఇక ఇతర పార్టీలు.. అంటే ప్రాంతీయ పార్టీలు కూడా తాము తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి తలవంచక తప్పదు. ఒకప్పుడు ఉత్తర భారతానికే పరిమితమయిన బీజేపీ ఇప్పుడు దక్షణాదిన కూడా విస్తరించింది. హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో అధికారంలోకి వచ్చింది. బలహీనంగా ఉన్నచోట్ల పొత్తులతోనూ, బలమైన చోట ఒంటరిగా పోటీ చేస్తూ బీజేపీ స్వీప్ చేసేస్తుంది. ఇక తెలంగాణ, తమిళనాడుపై తర్వాత కమలనాధుల కన్ను పడుతుందని చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఒడిశాలో కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ అధికారంలోకి రాలేదు. అక్కడ నవీన్ పట్నాయక్ పాతుకుపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం ఆయనను ఓడించి ఒడిశా గద్దెనెక్కింది.
మోదీ చరిష్మా బలంగా...
ఈవీఎంల పై నెపం మోపినా వేస్ట్. ఎందుకంటే మోదీ చరిష్మా బలంగా పనిచేస్తుందని భావించడమే. ఒక రాష్ట్రంలో గెలుపు సాధించాలంటే కొన్నేళ్ల పాటు అక్కడ బీజేపీ ఫోకస్ చేస్తుంది. అక్కడ ప్రత్యర్థులను తనకున్న బలంతో అణిచివేయడం ప్రారంభిస్తుంది. ముందు జనం మైండ్ సెట్ చేస్తుంది. తర్వాత ఎన్నికల సమయానికి తాను ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలహీనం కావడంతో రాష్ట్రాల్లో కూడా బీజేపీ తమ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జనం నమ్మే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇక దేశంలో ఇక ఏ పార్టీలూ మిగలవు. ఒకటే మిగిలే అవకాశాలున్నాయని విశ్లేషకులు సయితం అంటున్నారు. ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ ముందు మోకరిల్లడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అందుకే ఎన్నికల్లో ప్రత్యర్థులు గెలిస్తేనే జనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story