జీ20 సమావేశాల సందర్భంగా ఇవన్నీ మూసేస్తారు..
ప్రపంచ అధినేతలకు భారత్ ఆతిధ్యం ఇస్తోంది. ఢిల్లీలో ప్రగతి మైదానంలో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వేన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ , భారత్ మండపం, వేదికలుగా మారనున్నాయి.
జీ20 సమావేశాల సందర్భంగా ఇవన్నీ మూసేస్తారు...
ప్రపంచ అధినేతలకు భారత్ ఆతిధ్యం ఇస్తోంది. ఢిల్లీలో ప్రగతి మైదానంలో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వేన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ , భారత్ మండపం, వేదికలుగా మారనున్నాయి. సమావేశాలు 8 నుంచి 10 వరకు జరుగుతుండగా, ఆ మూడు రోజులు అతిధుల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. దేశంలోని అనేక ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి రానుందన కట్టుదిట్టమైన ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తోంది.
ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇంగ్లాండ్ అధ్యక్షుడు రిషిక్ సునాక్, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, సౌదీ రాజు సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ హాజరవుతారు. జీ 20 సమ్మిట్ ప్రగతిమైదానంలోని భారత్ మండపంలో జరగనున్నాయి. వచ్చిన ప్రతినిధులు మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ , నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ , ఇండియన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూ ను సందర్శించే అవకాశం ఉంది. అంతేకాకుండా మొదటి రెండు రోజులు వారాంతం కావడంతో దేశరాజధానిలో ట్రాఫిక్ ను కట్టడి చేస్తున్నారు. ఢిల్లీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని అతిధుల రక్షణకు భరోసా కల్సిస్తున్నామన్నారు.
ప్రపంచ ప్రతినిధుల రక్షణలో భాగంగా వ్యాపార కూడళ్లయిన మాల్స్, మార్కెట్లను మూసివేసి, వాహనాల రాకపోకను నియంత్రించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, విద్యాలయాలు, ప్రైవేటు ఆఫీసులకు ఈ మూడు రోజులు సెలవుదినాలుగా ప్రకటించారు. న్యూఢిల్లీ పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, దుకాణాలు, వ్యాపార సంస్థలను, లిక్కర్ షాపులు, స్మారక కట్టడాలను మూసివేస్తారు. అత్యవసరాలైన పాల కేంద్రాలు, కూరగాయలు, పండ్ల షాపులు, మందుల దుకాణాలు తెరచి ఉంచుతారు.