Tue Nov 05 2024 19:43:25 GMT+0000 (Coordinated Universal Time)
13 మంది విద్యార్థులకు కరోనా.. మళ్లీ ఆన్ లైన్ క్లాసులు షురూ !
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు.. కళాశాల యాజమాన్యం వెల్లడించింది. వారంతా
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు.. కళాశాల యాజమాన్యం వెల్లడించింది. వారంతా బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపింది. కాగా.. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో పెద్దగా కరోనా లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ప్రస్తుతం 13 మంది విద్యార్థులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు కళాశాల అనుబంధ సంస్థ ఎమ్ఐటీ వరల్డ్ పీఎస్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రశాంత్ డేవ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు వస్తున్న విద్యార్థులకు ప్రధాన గేటు వద్దే స్క్రీనింగ్ చేయగా.. ఒక విద్యార్థికి జలుబు లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. ఆ విద్యార్థిని వెంటనే ఇంటికి పంపించి.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాల్సిందిగా తల్లిదండ్రులకు సూచించినట్లు తెలిపారు. అతనికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ గా తేలింది. దాంతో అతనితో సన్నిహితంగా మెలిగిన విద్యార్థులను గుర్తించి.. వారికి కూడా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మొత్తం 25 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా.. 13 మందికి పాజిటివ్ గా తేలగా.. 8 మందికి నెగిటివ్ వచ్చింది. మరో నలుగురు విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కాగా.. ఈ 25 మంది విద్యార్థులు కళాశాలలోని వర్క్ షాప్ లో ఆల్ టెరైన్ వాహనంపై కలిసి పనిచేస్తున్నారని ఓ అధికారి తెలిపారు.
25 మంది విద్యార్థులకు పూర్తిగా టీకాలు వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పాజిటివ్ వచ్చినవారితో పాటు.. నెగిటివ్ వచ్చిన విద్యార్థులు కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నట్లు తెలిపారు. 13 మందికి కరోనా నిర్థారణ కావడంతో.. ఈ బ్యాచ్ కు ఆఫ్ లైన్ తరగతులను ఆపివేసి.. ఆన్ లైన్ తరగతులను పునరుద్ధరించినట్లు యాజమాన్యం తెలిపింది.
Next Story