Mon Dec 23 2024 14:12:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రాష్ట్రాలను పట్టించుకోలేదేందమ్మా?
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఊసే లేదు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు వరాలు ఉంటాయని అందరూ ఊహించారు
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ బడ్జెట్ లో ఊసే లేదు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు పెద్దయెత్తున వరాలు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉందనే చెప్పాలి. గతంలో ఎన్నికలకు జరిగే రాష్ట్రాలకు ప్రయోజనం అందేలా రూపొందించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు పెద్దయెత్తున ప్రాజెక్టుల రూపంలో నిధులు కేటాయిస్తారని భావించారు.
అంచనాలకు భిన్నంగా....
కానీ అంచనాలకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరవై ఐదేళ్ల దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి డిజిటల్ కరెన్సీ ని తెస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ను రూపొందించిందని, రాజకీయాలను పక్కన పెట్టిందన్న కామెంట్స్ ఆర్థిక నిపుణుల నుంచి వెలువడుతున్నాయి.
Next Story