White Cobra: మీరు ఎప్పుడైనా తెల్ల నాగుపాము చూశారా? వీడియో వైరల్
ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా ద్వారానే అని చెప్పక తప్పదు. అది నిజమైనా..అబద్దమైనా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
ఏదైనా వైరల్ కావాలంటే అది సోషల్ మీడియా ద్వారానే అని చెప్పక తప్పదు. అది నిజమైనా.. అబద్దమైనా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాములను అందరు చూసే ఉంటారు. నాగుపాము, కట్ల పాము, పెంజరా, కోబ్రా వంటి విషపూరితమైన పాములు తరచూగా కనిపిస్తుంటాయి. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి ఉంటాయి. కొన్ని అరుదైన పాములు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి పాములు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే మీరెప్పుడైనా తెల్ల నాగుపామును చూశారా..? అలాంటి పాములను శ్వేత నాగుపాము అని కూడా ఉంటుంటారు. ఇప్పుడు కోట్ల విలువైన శ్వేతనాగు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను గమనిస్తే ఎవరో తెల్ల నాగుపామును బస్తాలో బంధించి సురక్షితంగా అడవిలో వదిలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ తెల్లని కోబ్రా అనేది భారతదేశంలో కనిపించే ప్రత్యేక రకం పాము అని చెబుతుంటారు. ఇది ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి నైరుతి ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈ అరుదైన తెల్లటి పాము తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ ఇంట్లోకి రావడంతో దానిని పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలివేసినట్లు తెలుస్తోంది. బస్తాంలోంచి ఆ తెల్లటి నాగుపాము బయటకు వచ్చి అడవిలోకి వెళ్తున్నట్లు ఈ వీడియో చూడవచ్చు.