Tue Dec 24 2024 00:22:54 GMT+0000 (Coordinated Universal Time)
నా దృష్టిలో వాళ్లు భారతీయులే కాదు : సీఎం నితీష్ కుమార్
బీహార్ లో మద్యనిషేధం అమల్లో ఉన్నా.. రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్తీ సారా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఫలితంగావాటిని..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మందుబాబులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బీహార్ లో మద్యనిషేధం అమల్లో ఉన్నా.. రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్తీ సారా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఫలితంగావాటిని సేవించిన మందుబాబులు అనారోగ్యం బారిన పడుతూ.. మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ మందు తాగేవాళ్లంతా మహాపాపులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం, కల్తీ సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని, ఎలాంటి సహాయం అందజేయబోమని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ కూడా మద్యం వ్యతిరేకి అని గుర్తు చేశారు. ఆ మహాత్ముడి సిద్ధాంతాలను పట్టించుకోకుండా.. మద్యం సేవించేవారు ముమ్మాటికీ మహా పాపులని నితీష్ అన్నారు. మద్యం సేవించేవారు తన దృష్టిలో భారతీయులే కాదన్నారు. మందుతాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది దానిని సేవిస్తూనే ఉన్నారని, దాని పర్యవసానాలకు వారే బాధ్యులని తెలిపారు. ఇదిలా ఉండగా.. బీహార్ లో మద్య నిషేధాన్ని అమలు చేయడంలో బ్రిటీష్ ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Next Story