Mon Dec 15 2025 02:04:37 GMT+0000 (Coordinated Universal Time)
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో కేదార్నాధ్ కు వెళ్లే దారులన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో పెద్దయెత్తున ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదని చెబుతున్నారు.
క్యూ లైన్ ముందుకు కదలక...
క్యూ ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 20వ తేదీ వరకు చార్ధామ్ యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే అందరికీ దర్శనం లభిస్తుందని భక్తులు ఓపికతో ఆలయానికి తరలి రావాలని ప్రభుత్వం కోరుతోంది.
Next Story

