Mon Dec 23 2024 23:11:57 GMT+0000 (Coordinated Universal Time)
పాముని కొరికి చంపిన బాలుడు
దినేశ్ సింగ్ అనే వ్యకి తన మూడేళ్ల కొడుకు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడి..
మూడేళ్ల బాలుడు పామును కొరికి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఫరూఖాబాద్ జిల్లా కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మాద్నాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. దినేశ్ సింగ్ అనే వ్యకి తన మూడేళ్ల కొడుకు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడి.. వద్దకు పాము వచ్చింది. అది కరుస్తుందని తెలియని ఆ పిల్లాడు.. తన వద్దకు వచ్చిన పాముని పట్టుకుని అమాంతంగా కొరికేశాడు. దాంతో ఆ పాము అక్కడికక్కడే గిలా గిలా కొట్టుకుని చనిపోయింది. కొద్దిసేపటికే పిల్లాడు కూడా స్పృహతప్పి పడిపోయాడు.
ఏదో పనిలో ఉన్న బాలుడి నాయనమ్మ పిల్లాడు ఏం చేస్తున్నాడో చూద్దామని రాగా.. పిల్లాడి నోటికి రక్తం..పక్కనే పడి ఉన్న పాముని చూసి హడలిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారిని పెద్దపెద్ద కేకలతో పిలిచి.. వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులకు ఏం జరిగిందో వివరించగా.. బాలుడికి చికిత్స అందించారు. 24 గంటల చికిత్స తరువాత ఎటువంటి ప్రమాదం లేదని చెప్పటంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడు పాముని కొరికి చంపడం సంచలనంగా మారింది.
Next Story