Mon Dec 23 2024 08:09:20 GMT+0000 (Coordinated Universal Time)
మా అమ్మను జైల్లో పెట్టండి.. పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు
బుడ్డోడు ఏడుపు ఆపకపోవడంతో.. చేసేదేం లేక తండ్రి పిల్లాడిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ..
మా అమ్మను జైల్లో పెట్టండంటూ మూడేళ్ల బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లా దేఢ్తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ చేసిన ఫిర్యాదు ఇది. సద్దామ్ కు వాళ్ల అమ్మ తలస్నానం చేయించి.. కాటుక పెడుతుంటుంది. కానీ అది సద్దామ్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. కాటుక పెట్టొద్దంటూ అల్లరి చేయడంతో.. తల్లి ముద్దుగా అతని చెంపపై తట్టింది. అంతే.. సద్దామ్ కు కోపమొచ్చింది. ఏడుస్తూ వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి పోలీస్స్టేషన్కు వెళదాం వస్తావా? రావా? అని అడిగాడు.
బుడ్డోడు ఏడుపు ఆపకపోవడంతో.. చేసేదేం లేక తండ్రి పిల్లాడిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ సబ్-ఇన్స్పెక్టర్ ప్రియాంకా నాయక్కు సద్దామ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టడంతో ప్రియాంకా మోకాళ్లపై కూర్చుని సద్దామ్ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. "మా అమ్మ నాకు కాటుక పెడుతోంది. నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది. ఆమెను జైల్లో పెట్టండి" అని సద్దామ్ చెప్పిదంతా తెల్లకాగితంపై రాశారు. అనంతరం సంతకం కూడా తీసుకున్నారు. తన తల్లిపై చర్యలు తీసుకోవాలని మూడేళ్ల సద్దామ్ ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు చేతులు జోడించి కోరాడు.
Next Story