Mon Dec 23 2024 20:32:50 GMT+0000 (Coordinated Universal Time)
అయోధ్యలో విగ్రహ ప్రతిష్టకు మోదీ
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. వచ్చే ఏడాడి జనవరి 20 నుంచి 24 తేదీల్లో అయోధ్యలోని రామమందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు పండితులు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది.
భారీ ఏర్పాట్లు....
ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పునర్మిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంతో పనులు పూర్తయ్యాయి. విగ్రహ ప్రతిష్ట కూడా పూర్తయితే వెంటనే సందర్శకులను అనుమతిస్తారని నిర్వాహకులు తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో పాటు పలు రహదారుల వెడల్పు కార్యక్రమాలను కూడా చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముండటంతో వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
Next Story