Thu Jan 16 2025 13:51:25 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra : మహారాష్ట్ర ముఖ్యమత్రి ప్రమాణం అప్పుడే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. డిసెంబరు 5వ తేదీన ముంబయిలో ప్రమాణ స్వీకారం ఉంటుంది
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. డిసెంబరు 5వ తేదీన ముంబయిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. డిసెంబరు 5వ తేదీన ఆజాద్ మైదానంలో జరిగే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. సాయంత్రం ఐదుగంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ రాలేదు.
డిసెంబరు 5వ తేదీన...
అయితే బీజేపీ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పదవి చేపడతారని మాత్రం ఒక నిర్ణయానికి రావడం మాత్రం జరిగిందని చెబుతున్నారు. మంత్రివర్గంలో ఎవరెకెన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారన్నది తెలియకపోయినా ప్రమాణ స్వీకారం ముహూర్తం మాత్రం ఖరారయింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే తన సొంత ఊరుకు వెళ్లడంతో ఆయనతో చర్చించేందుకు మహాయుతి నేతలు ప్రయత్నిస్తున్నారు.
Next Story