Mon Dec 23 2024 09:11:07 GMT+0000 (Coordinated Universal Time)
లవర్ ను ఇంప్రెస్ చేయడానికి.. అధికారి వేషంలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో..!
లవర్ ను ఇంప్రెస్ చేయడానికి.. అధికారి వేషంలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ లో..!
ఢిల్లీలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఆవరణలోకి అధికారిగా నటిస్తూ ప్రవేశించిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అలీఘర్ నివాసి అయిన గౌరవ్ అనే వ్యక్తి జూలై 22న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి ప్రవేశించాడు. ఎంతో సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా అతను పట్టుబడ్డాడు. ID తనిఖీ కోసం అతన్ని ప్రవేశ ద్వారం వద్ద ఆపారు. భద్రతా సిబ్బందికి అతను సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో, వారికి అతనిపై అనుమానం వచ్చింది.
విచారణలో భాగంగా ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికే తాను ఈ పని చేశానని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. యూనిఫాంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి ప్రవేశించినట్లు అతను వెల్లడించాడు. ఐఏఎఫ్లో అధికారినని తన ప్రియురాలిని నమ్మించేందుకు అలా చేశానన్నాడు. నిందితుడిని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్ 140, 170, 171, 449 మరియు 447 కింద కేసు నమోదు చేశారు.
Next Story