Sun Dec 22 2024 01:53:10 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రంజాన్
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండగకు నేడు ప్రారంభమైంది.
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పండగకు నేడు ప్రారంభమైంది. హైదరాబాద్లో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం ముగిసి నేడు ఈద్ ముబారక్ జరుపుకుంటన్నారు. నేడు మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలను ముస్లిం సోదరలు చేయనున్నారు. కఠిన ఉపవాస దీక్షలకు మాసమంతా ఉండి ఈరోజు దానికి ముగింపు పలకనున్నారు. మరి కాసేపట్లో అన్ని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి.
జగన్ ఆకాంక్ష...
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ పండగ సందర్భంగా ఆయన అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు.మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ... సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి అన్నారు
కేసీఆర్ శుభాకాంక్షలు...
రంజాన్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంకషలు తెలిపరు. రంజాన్ ఉపవాస దీక్షలను పూర్తి చేసుకుని నేడు ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను అందరు ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సోదరభావంతో మెలిగేలా భగవండుడు ఆశీర్వాదాలు పొందాలని కేసీఆర్ కోరుకున్నారు.
Next Story