Sun Dec 22 2024 14:33:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పశ్చిమ బెంగాల్ బంద్
ఈరోజు పశ్చిమ బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపు నిచ్చింది
ఈరోజు పశ్చిమ బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపు నిచ్చింది. నిన్న కోల్కత్తా సెక్రటేరియట్ వద్ద జూనియర్ డాక్టర్లు, విద్యార్థులపై పోలీసులు చేసిన దాడులకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు నిచ్చింది భారతీయ జనతా పార్టీ. ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ లో పన్నెండు గంటల పాటు బంద్ ను పాటించాలని పిలుపు నిచ్చింది.
అత్యవసర సేవలు మినహా...
అత్యవసర సేవలు మినహా మిగిలిన దుకాణాలు అన్ని మూసివేయాలని బీజేపీ ప్రకటన జారీ చేసింది. కోల్కత్తాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన నిన్న కొంత ఉద్రిక్తతలకు దారి తీసింది. వారిపై వాటర్ క్యానన్లను ఉపయోగించి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులపై దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ బంద్ కు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story