Wed Dec 25 2024 13:46:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు క్రిస్మస్.. వేడుకలు
నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. విశ్వమానవాళికి మార్గదర్శనం చేసిన క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు క్రైస్తవ సోదరులు నేడు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. ఒక్క మతమే కాకుండా అన్ని మతాల వారూ ఆచరించాల్సిన క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శనంగా నిలుస్తాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పరం మత విశ్వాసాలను కాపాడుకుంటూ కొనసాగాలని కోరుకుంటారు.
శాంతి సందేశం ఇచ్చిన..
పేద నుంచి ధనికుల వరకూ చర్చికి వెళ్లి ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన ఏసుక్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్ వేడుకలనుజరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఏటా డిసెంబరు 25వ తేదీన ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. జీసెస్ కటాక్షాలు పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తారు. పేదలకు అన్నదానాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అన్ని చర్చిలు సుందరంగా అలంకరించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story